కవిత ఇంట్లో అందర్నీ ఆకర్షించిన చిన్ని చెట్టు.. జైలు నుంచి విడుదలై, ఇంటికి చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కలవడానికి వేలాదిమంది కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. బుధవారం(ఆగస్ట్ 28) శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆమె వెంట వచ్చిన వందలాది కార్ల కాన్వాయ్ తో వచ్చిన జనంతో ఇల్లు మొత్తం కిక్కిరిసిపోయింది. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత ఇంటికి వచ్చారు కవిత. ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లో అందంగా ఆనందంగా ఒదిగిపోయారు. ఒక్కొక్కరుగా కవితను కలిసి... మేమున్నామంటూ ధైర్యం చెప్పి, ఓ ఫోటో దిగి వెళ్ళిపోయారు అభిమానులు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న అభిమానులకు ఓ మొక్క ఆకర్షణగా కనిపించింది. ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్లి ఆ మొక్కను చూసి వెళ్లడం.. కొంతమంది ఆ మొక్కకు ఉన్న రెండు ఆకులను ఫోటోలు తీసుకోవడం కనిపించింది. ఇంతకీ ఆ చిన్న చెట్టులో అంత స్పెషాలిటీ ఏముందని జాగ్రత్తగా పరిశీలిస్తే.. నిజంగానే అందులో స్పెషల్ ఉంది.