మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీషీటర్ సురేందర్ అరెస్ట్.. దర్యాప్తులో సంచలనాలు

మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీషీటర్ సురేందర్ అలియాస్ సూరి పోలీసులకు చిక్కాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న సూరిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌తో సహా 5 జిల్లాల్లో రౌడీషీటర్ సురేందర్ అలియాస్ సూరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సూరి పోలీసులకు తెలిపాడు. సూరి గ్యాంగ్ పై ఇప్పటివరకు పలు పోలీస్‌ స్టేషన్లలో 40 కేసుల వరకు నమోదైనాయి. రాచకొండ కమిషనరేట్ పోలీసులు నగర బహిష్కరణ చేయడంతో వరంగల్ ను అడ్డాగా మార్చుకున్న రౌడీషీటర్ సూరి.. తుపాకులతో బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నాడు.