జూబ్లిహిల్స్‌లో షాకింగ్‌ సీన్‌.. కళ్ల ముందే కాలి బూడిదై పోయిన BMW కారు

నిన్న మొన్నటి వరకు వేసవి వేడి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎండ ధాటికి రోడ్లపై వాహనాల్లో మంటలు చెలరేగి ఎక్కడపడితే అక్కడే కాలిబూడిదై పోయాయి. ఇదంతా వేసవి ప్రభావం అని అనుకున్నారంత. కానీ ప్రస్తుతం అలాంటి వేడి పరిస్థితులు లేకపోయినా వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఏదో చిన్న బ్రాండ్‌ వాహనం అయితే ఇంతగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీఎమ్‌డబ్ల్యూ కారు కాలిపోవడం చర్చణీయాంశంగా మారింది.