ఒక్కసారిగా స్క్రీన్ పై కనిపించిన సమంత.. నాగచైతన్య రియాక్షన్ చూశారా.. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2014 మే 23న గ్రాండ్ గా విడుదలైంది. అప్పట్లో ఈమూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మనం సినిమా విడుదలై పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేసింది చిత్రయూనిట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి మనం మూవీ స్పెషల్ షోలను ప్రదర్శిస్తున్నారు.