నైజీరియాలో కడునా నుండి అబుజా ప్రాంతానికి ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ రైలు మంగళవారం పట్టాలు తప్పింది. పలు బోగీలు బోల్తా పడ్డాయి. ఊహించని రీతిలో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డట్టు తెలుస్తోంది. బోల్తా పడిన క్యాబిన్‌ల నుండి బయటకు రావడానికి ప్రయత్నించిన ప్రయాణికులకు స్థానికులు సాయం చేశారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా నిర్ధారణ కాలేదు.