సీసీ కెమెరాలకు అడ్డంగా బుక్కైన కిలాడీ లేడీలు..! చీకటి పడ్డాక తాళాలు పగలగొట్టి దోచుకునే దొంగలు కాదు వాళ్లు. మూడో కంటికి కన్పించకుండా కన్నం వేసే టైపు కానే కాదు. కత్తులతో బెదిరించి సొమ్ము కాజేసే రకం అస్సలు కాదు. దర్జాగా లోపలికి వస్తారు. మొదట షాపు ఓనర్‌ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ సమయంలోనే తమ పని పూర్తి చేస్తారు. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది. ఓనర్ తేరుకునేలోపు నిలువు దోపిడీ జరిగిపోతుంది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ అక్కడ దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకోలేరు. అంత చాకచక్యంగా దోచేస్తారు. అంతా ఓ ప్లాన్ ప్రకారం చోరీ చేస్తారు.