పార్లమెంటులో శాతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వాడి వేడి చర్చ కొనసాగుతోంది. నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి ఆమిత్ షా ప్రవేశ పెట్టిన మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది లోక్ సభ. అయితే ఈరోజు జర్నలిస్టుల రక్షణ కోసం ఏర్పాటైన పాలసీ ఫ్రేమ్ వర్క్ పై చర్చ జరిగింది. ప్రతిపక్షాలు దీనిపై పలు ప్రశ్నలు సంధించాయి. దేశంలో జర్నలిస్టుల భద్రతను నిర్ధారించడానికి ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా.. వాటి వివరాలు తెలియజేయాలని కోరింది.