వేగంగా వస్తున్న వ్యాన్. ఆపి చెక్ చేస్తే షాక్! ఏవోబీలో తాబేళ్ల అక్రమ రవాణా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు అక్రమంగా తాబేళ్లను రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు అటవీశాఖ సిబ్బంది. ఆంధ్రాలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశా లోనీ మల్కన్‌గిరి జిల్లా కలిమెలా, ఎంవీ 79 గ్రామాలకు వ్యాన్‌లో 500 తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ఒడిస్సా లోని చిత్రకొండ అటవీశాఖ రేంజ్ అధికారులు.