ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో ముమ్మిడివరం మండలం చెయ్యేరు లో అంగరంగ వైభవంగా దాసులమ్మ పంటల జాతర జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉండాలని.. తమ గ్రామంలో కరువుకాటకాలు రాకుండా సుభిక్షంగా ఉందని జాతరను జరుపుకున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు, కోడళ్ళు అందరూ అఖండ జ్యోతిని వెలిగించి ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లి సమర్పించారు.