కవ్వాల్ అభయారణ్యం గాంధారివనంలో పక్షుల కిలకిలరావాలతో కొత్త శోభ సంతరించుకుంది. వలస వస్తున్న పులులే కాదు పక్షులు సైతం కవ్వాల్ టైగర్ జోన్ లోకి ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి. వందల రకాల పక్షులు విభిన్న రకాల వన్యప్రాణులు, వలస వస్తున్న విదేశీ పక్షులు ప్రకృతి ప్రేమికుల కెమెరాల్లో అందంగా బంది అవుతున్నాయి. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో సాగుతున్న ‘బర్డ్ ఫెస్టివల్‘ అటు విద్యార్థులకు ఇటు పక్షి ప్రేమికులకు నయనానందాన్ని కలిగిస్తున్నాయి.