శివలింగం కనిపించకుండా గోడ కట్టేసిన ముగ్గురు మహిళలు.. రీజన్ వింటే షాక్

ఈ ఘటన యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ సెంటర్ లోని రాజీవ్ ఆవాస్ యోజన బహుళ సమీపంలో ఒక శివాలయంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న శివ లింగానికి భక్తులు రోజూ పూజలు చేస్తారు. యధాప్రకారం ఈ రోజు (సోమవారం) కూడా భక్తులు పూజ చేయడానికి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. శివలింగం కనిపించకుండా ఎవరో ఇటుకలతో, సిమెంటుతో కవర్ చేశారు.