నాగుపామును ఓ ఆటాడుకున్న పిల్లులు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని బృందావన చంద్ర ఆలయంలో ఒక పాము కలకలం సృష్టించింది. సమీప పొదల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఒక నాగు పాము ప్రవేశించింది. ఆలయంలోకి వెళ్లే క్రమంలో అక్కడే తిరుగాడుతున్న రెండు పిల్లులు నాగు పామును గమనించాయి. పాము, పిల్లులు ఎదురెదురుగా తారసపడటంతో జాతి వైరoతో అవి కయ్యానికి కాలుదువ్వాయి.