దైవ దర్శనానికి వెళ్తుండగా ఓ కుటుంబానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. కారు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లోనే ఊహించని ఘోరం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో కారులోని ఉన్నవారందరూ మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా ఈగటపెంట వద్ద చోటుచేసుకుంది.