ఉత్తరాఖండ్‌ల్ సంభవించిన క్లౌడ్‌బర్ట్స్‌తో భారీ వరదలు జలప్రళయాన్ని సృష్టించాయి. ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 28 మంది కేరళ టూరిస్టుల ఆచూకీ గల్లంతైంది. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడినవారు కాగా, మిగిలిన 8 మంది కేరళకు చెందిన వారిగా తెలిసింది. ఈ బృందంలోని బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి ఉదయం బయల్దేరుతున్నట్టు చెప్పారని, అనంతరం వారి ఫోన్లు పని చేయడం లేదని, వాటిలో ఛార్జింగ్ లేదో. లేక సిగ్నల్ లేదో తెలియక భయంతో పోలీసులకు సమాచారం అందించామని చెప్పారు. వారు వెళ్తున్న మార్గంలోనే కొండచరియలు విరిగిపడ్డాయని తెలిసింది. గల్లంతైన వారి కోసం ఆర్మీ సిబ్బంది గాలిస్తున్నారు.