గోదారోళ్లా మజాకా.. కొత్త అల్లుడికి 260 వెరైటీలతో అదిరిపోయే విందు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. అసలు సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు, పిండి వంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత పెద్దదిగా ఉంటుంది. తెలుగు ప్రజల మదిలో సంక్రాంతికి మించిన పెద్ద పండుగ ఏది ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఏటా సంక్రాంతి పేరుతో ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలు వీక్షించడం కోసం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు, అతిధులు ప్రత్యేకంగా వస్తుంటారు. అంతేకాక సినీ రాజకీయరంగ ప్రముఖులు సైతం సంక్రాంతి వేడుకలలో పాల్గొని ఆనందిస్తారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే గోదావరి జిల్లాల్లో కనిపించే సంక్రాంతి సందడే వేరే లెవెల్. గోదావరి జిల్లాలకు మరో ప్రత్యేకత ఉంది. అదేంటో మీకు తెలుసా... అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..