భార్యపై అనుమానంతో పసిబిడ్డను చంపి.. భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి కన్న తండ్రే అమానుషంగా చంపేశాడు. పసిబిడ్డ డెడ్ బాడీని ఓ చోట పాతి పెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి.. పేరు మార్చుకుని... ఓ రైతు దగ్గర తోటలో పనికి చేరాడు.