పిల్లి గుడ్డిదైతే ఎలుక ఇల్లు పీకి పందిరేస్తుందన్నట్లుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వైద్యుల నిర్వాహకం. ఏకంగా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ హాల్‌లో జన్మదిన వేడుకలు నిర్వహించి రోగులు నివ్వెరపోయేలా చేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పనితీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. రోజుకు 300ల మందికి పైగా వచ్చే తొర్రూరు ప్రభుత్వ దవాఖానలో పేషెంట్ల సేవ మరిచిన సిబ్బందంతా డాక్టర్ సాబ్ మెప్పుకోసం సారు వారి గానా బజానాలో మునిగి పోయారు.