అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆదుకునేందుకు భర్త పదవీ విరమణ చేస్తున్న క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో ప్రమాదం జరిగింది. ఆఫీస్‌లో జరుగుతున్న రిటైర్మెంట్ ఫంక్షన్‌లో అందరూ సంబరాలు నిర్వహించుకుంటూ ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నారు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన మొత్తం రాజస్థాన్ ప్రజలను కలచివేసింది.