శాంతి భద్రతలను కాపాడడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పోలీసులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడుతూ జనాల మన్ననలు పొందుతున్నారు.. తాజాగా ఆత్మహత్య ప్రయత్నం చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు పోలీస్ కానిస్టేబుల్.. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి అభినందనలు వెలువెత్తుతున్నాయి..