నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు టాక్ షోతో ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మన్నలను పొందిన ఆహా. అన్ స్టాపబుల్ అంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. బాలయ్య షోతో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనమెంట్ ఇస్తుంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు సీజన్ 4తో ప్రేక్షకుల ముందుకు రానుంది.