శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. దీంతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో సాగర్ 18 గేట్లను ఎత్తి.. దిగువకు 1.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.44 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.