కాలుష్య కాసారంగా యమునా నది.. దడ పుట్టించే దృశ్యాలు ఇవిగో..

పారిశ్రామిక వ్యర్థాలు, కలుషిత పదార్థాల వల్ల ప్రతి సంవత్సరం ఈ నదిలో విషపూరితమైన నురగ ఏర్పడుతుంటుంది. తాజాగా ఢిల్లీలోని కాళింది కుజ్ వద్ద ఈ ఏడాది కూడా పెద్దఎత్తున నురగ ఏర్పడింది. దేశ రాజధానిలో ఇప్పటికే వాయు నాణ్యత క్షీణించింది. ప్రస్తుతం యమునా నది కూడా కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.