పండితుల ఆశీర్వచనం తీసుకున్న ఒవైసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. మలక్పేట్లోని లలిత బాగ్లో ఆయన వేద పండితుల వద్ద ఆశీర్వచనం తీసుకోవడం కనిపించింది. పూజారులు ఒవైసీకి పూలమాల వేసి, కండువా కప్పి ఆశీస్సులు అందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఒవైసీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.