మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 15 మంది ఏసీబీ అధికారుల బృందం మంగళవారం(ఆగస్ట్ 13) ఉదయం ఆయన ఇంటికి చేరుకుని సోదాలు చేపట్టారు. అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.