ప్రపంచానికి శాకంభరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘణత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే... ప్రతియేటా ఆషాడమాసంలో నిర్వహించే శాకంభరీ ఉత్సవాలకు చాలాపెద్ద చరిత్రే ఉంది.. ఆషాడ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్నిరకాల కూరగాయల, పండ్లు, పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంవల్ల సర్వసుఖాలు సిద్దిస్తాయని.. చేపట్టిన అన్నిరంగాలలో విజయాలు కలిగి, కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కరుణాకటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాడవిశ్వాసం.