నయా స్కెచ్.. పాతిపెట్టిన మృతదేహాన్నే దొంగిలించాడు

నయా స్కెచ్.. పాతిపెట్టిన మృతదేహాన్నే దొంగిలించాడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ చిత్రమే తీసేంత స్థాయిలో స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయినట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు.