ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్‌లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్ మోడ్‌లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే.. నేను ఇంతకింతా చేస్తానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నంబర్ గేమ్‌కి చెక్ పెట్టబోయారు. రేవంత్ యాక్షన్.. కేసీఆర్ రియాక్షన్.. తెలంగాణ పాలిటిక్స్‌లో అసలైన దంగల్ టైమ్ షురూ.