పుణేలో కుప్పకూలిన ప్రైవేట్ హెలికాప్టర్‌

పుణేలో కుప్పకూలిన ప్రైవేట్ హెలికాప్టర్‌ మహారాష్ట్ర లోని పుణేలో ప్రైవేట్‌ సంస్థ హెలికాప్టర్‌ కుప్పకూలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పౌడీ గ్రామం లోని పొలాల్లో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ చెట్టును ఢీకొని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా నలుగురికి తీవ్రగాయాలయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు.