ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నారా భువనేశ్వరికి ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు.