భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ KTPS కర్మాగారంలో పాత కూలింగ్ టవర్లను ఇవాళ కూల్చివేశారు. A, B, Cస్టేషన్‌లలో 680 మెగావాట్లు ఉత్పత్తి చేసే 8 పాత కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది. 1965-1978 ప్రాంతంలో ఈ టవర్లను నిర్మించారు. సుమారు 50 ఏళ్లపాటు ఇవి సేవలు అందించాయి.