ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు పెరిగిపోతున్నాయి. ఇంట్లోని పెద్దలు ఒప్పుకొకపోతే.. పారిపోయి మరి పెళ్లి చేసుకుంటున్నారు యువత. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కావాలని కోరుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చేసింది. ఓ జంట ప్రేమ పెళ్లి చేసుకొని పోలిస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఒక యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లివ్-ఇన్‌లో ఉండాలని నిర్ణయించుకుంది. వద్దని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆ అమ్మాయి మాత్రం పోలీసులతో కలిసి వెళ్లిపోయింది. సమాజంలో ఇలాంటి ఘటనలు పెరగడాన్ని ప్రస్తావిస్తూ ఓ ఎమ్మెల్యే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.