ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దూసుకుపోతున్నారు. ఎన్నికల క్యాంపేన్‌లో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ తొమ్మిదో రోజు బస్సు యాత్ర.. నెల్లూరు జిల్లాలో సాగనుంది. సాయంత్రం కావలిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఉదయం 9గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి జగన్ బస్సుయాత్ర మొదలవుతుంది.