ఒక్క మాటతో కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు..!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినోద్ అనే యువకుడు కరెంట్ పోల్ ఎక్కి అటు పోలీసులను, ఇటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టాడు. రెండు గంటల పాటు కరెంట్ పోల్ పైనే ఉండి, అందరికి ముచ్చెమటలు పెట్టించాడు దీనికి కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే..! వినోద్ నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన తండ్రి ఇంట్లో నుండి వెళ్లిపోమ్మన్నాడు. తండ్రి మాటలకు మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ.. కరెంట్ పోల్ ఎక్కి.. నిరసనకు దిగాడు. ఎంతకీ కరెంట్ పోల్ దిగకుండా, సుమారు 2 గంటల పాటు హంగామా సృష్టించాడు.