హోటల్ యజమానులకు మజ్లీస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

హోటల్ యజమానులకు మజ్లీస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్! టోలిచౌకి చౌరస్తాలో స్థానికంగా ఉన్న ఓ హోటల్ నుంచి బిర్యానీ వ్యర్థ పదార్థాలు, కూరగాయల చెత్తను మూటలుగా కట్టి ఆ మార్గంలో ఉన్న పైప్ లైన్ లోనే వేస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో నీరు నిలిచిపోతుందని అధికారులు గుర్తించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది. ఈ సమస్యపై స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న అధికారులు పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీంతో ఇది చివరికి స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ దృష్టికి చేరింది. హోటల్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు పైపు లైనులో వేస్తుండడంతోనే సమస్య ఉత్పన్నమవుతుందని తెలుసుకున్నారు ఎమ్మెల్యే. వెంటనే హోటల్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేదీ లేదని హెచ్చరించారు.