ప్రతి రోజు చెట్టుపై దర్శనమిస్తున్న నాగుపాము

ప్రతి రోజు చెట్టుపై దర్శనమిస్తున్న నాగుపాము ఎక్కడైనా పాములు కనిపించకుండా తిరగడంతోపాటు పొదలు, రహస్య ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఏడాది నుంచి నాగుపాము పొలంలో తిరుగుతూ చెట్టుపై ఎక్కి తిష్టవేసింది. ఆ ఊరిలోకి వచ్చిన నాగుపాము నిత్యం ప్రజలకు దర్శనమిస్తుంది. వచ్చి పోయే వారిని గమనిస్తూ ఉంటుంది. దీన్ని చూసిన జనం ఏకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ విచిత్రమైన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజిరం పేట, కూకుట్లపల్లి గ్రామాల శివారులోని పొలంలో దర్శనమిస్తుంది.