ఉమ్మడి చిత్తూరు జిల్లాపై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ నీవానది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. భారీ వర్షానికి పూరి గుడిసె గోడకూలి చిందేపల్లి గ్రామానికి చెందిన 4 ఏళ్ల యశ్వంత్ ప్రమాదంలో మృతి చెందాడు. 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైన పూరిగుడిసె గోడ కుప్పకూలడంతో తీవ్రంగా గాయపడ్డ యశ్వంత్ ను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించగా మార్గమధ్యంలోనే యశ్వంత్ మృతి చెందాడు.