మావోయిస్టుల ఇలాకాలో ఇప్పుడు మత్తు పదార్థాలు కలవరపెడుతున్నాయి. యువత మత్తుకు చిత్తు కాకుండా ఖాకీలు ఊళ్లను జల్లడ పడుతున్నారు. ఒకవైపు స్నిఫర్ డాగ్స్‌తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, మరోవైపు అవగాహన ర్యాలీలతో యువత మత్తుకు బలి కాకుండా చైతన్య పరుస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో స్నిఫర్ డాగ్స్ గంజాయి మూలాలు పసిగట్టడంలో కీలకంగా మారాయి..