వాళ్ళంతా మత్స్యకారులు.. తొమ్మిది మంది కాకినాడ తీరం నుంచి మర బోటులో చేపల వేటకు బయలుదేరారు. పదిరోజులు గడిచాయి. వేట సాఫిగా సాగుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా బోటులో భారీ శబ్దం.. తెరుకునే లోగా భారీ మంటలు..! అందరూ మంటల్లో చిక్కుకున్నారు. నడి సంద్రం.. పైన ఆకాశం, కింద నీరు.. చుట్టూ కనుచుపుమేర ఎవరూ లేరు. మంటల్లో చిక్కుకున్న వాళ్ళు హాహా కారాలు చేస్తున్నారు. అప్పటికే అందరికి కాలిన గాయ్యాలయ్యాయి. ఇంతలో కోస్ట్ గార్డ్ కు సమాచారం అందింది. స్పాట్ కు చేరుకుని ప్రాణాలకు తెగించి తొమ్మిది మంది సురక్షితంగా కాపాడారు.