కార్తీక మాసం తమకు అస్సలు కలిసి రాలేదంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరటి రైతులు. గత కొన్ని రోజులుగా దారుణంగా పడిపోయిన అరటి మార్కెట్.. కార్తీక మాసంతో పెరుగుతుందనుకున్న అరటి రైతులకు ఈసారి కూడా ఎదురు దెబ్బ తగిలింది. తుఫాను ప్రభావంతో అరటి ధరలు అమాంతం పడిపోయాయి. అంబాజీపేట అరటి మార్కెట్‌కు అరటి గేలలు భారీగా తరలివచ్చినా.. ధరలు మాత్రం లేవని అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. తుఫాన్ కారణంగా గేలలు పడిపో నాసిరకంగా మారాయని.. దీంతో మార్కెట్‌లో వాటిని కొనే వారు లేక సరుకు అలాగే మిగిపోయిందన్నారు.