క్షణం అలస్యమై ఉంటే.. అంతే సంగతులు..!

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో, 14 ఏళ్ల బాలిక ప్రాణాలను పోలీసుల నిఘా కాపాడింది. ఆమె బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకడానికి ప్రయత్నిస్తుండగా, పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ బృందం ఆమెను గమనించి అప్రమత్తమైంది. ఆ బాలిక వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడుతూనే, ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. ఇంతలో, ఒక యువకుడు ఆ అమ్మాయిని కాపాడటానికి బ్రిడ్జి ఫిల్లర్‌పైకి దూకాడు. ఆ అమ్మాయి జారిపడి స్తంభం నుండి వేలాడిందిది. ఇది చూసిన పోలీసు అధికారులు కూడా లోపలికి దూకారు. స్థానికుల సహాయంతో, అమ్మాయిని పైకి లాగారు. అక్కడి నుంచి ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు