అవినాశి కామరాజ్ నగర్‌కు చెందిన షణ్ముగం (55) రైతు. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం అవినాసిలోని బ్యాంకుకు వెళ్లి రూ. 2 లక్షలు తీసుకుని వాహనం వెనుక సీటు కింద దాచిపెట్టాడు. అనంతరం డబ్బులతో అదే ప్రాంతంలోని దుకాణం సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి లోపలికి వెళ్లాడు. అప్పుడు అతనికి తెలియకుండా 3 ద్విచక్రవాహనాలలో వచ్చిన ఆరుగురు దుండగులు అతడిని వెంబడించి, టూవీలర్ వెనుక సీటు తాళం పగులగొట్టి రూ. 2 లక్షలు అపహరించుకుని వెళ్లారు.