గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఫార్చునర్ కారులో వచ్చి మరీ దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. పొన్నూరులోని లక్ష్మీ ప్రసన్న వెండి ఆభరణాల షాపులో షెటర్ తాళాలు పగులగొట్టి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. నలుగురు దొంగలు దుకాణంలో చొరబడి వెండి, బంగారు ఆభరణాలతోపాటు నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు బాధితుడు. చోరీ అయిన సొత్తు విలువ 28 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదుచేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.