అంజనీపుత్రునికి వడలతో అభిషేకం...ఎక్కడంటే

దేవుడికి జలాభిషేకం, పాలాభిషేకం, పుష్పఅభిషేకం చేయడం చూసాం కానీ శ్రీకాకుళం జిల్లాలో భక్తులు వడలతో అభిషేకం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లోగల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ ట్రాలీ రిక్షా యూనియన్ కార్మికులు అంజనీసుతునికి నోరూరించే 10,116 (పదివేల నూటపదహారు) వడలతో అభిషేకం చేసి పట్టణంలో హాట్ టాపిక్ గా నిలిచారు.