Viral Video: చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదుగా..

కోతి చేష్టలు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొన్ని కోతులు మనుషులను బెదిరించి మరీ తినుబండారాలు ఎత్తుకెళ్తే.. మరికొన్ని కోతులు దొంగచాటుగా చోరీ చేస్తుంటాయి.. ఇంకొన్ని కోతులు అయితే ఎంతో తెలివిగా తమకు కావాల్సినవి లూటీ చేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.