ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్‌లతో సహా పదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలు తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ పట్టణానికి చెందిన రెండు ప్రైవేట్ కాలేజీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లతో సహా పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.