హిందువులకు తొలి పండుగ వినాయక చవితి. 'భాద్రపద శుద్ధ చవితి' రోజున విఘ్నేశ్వరుడి పుట్టిన రోజు అని వినాయక చతుర్ది పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి సందర్భంగా నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు గీసిన చిత్రం అందరిని అబ్బుర పరుస్తోంది. అగ్గి పెట్టెపై చిత్రకారుడు అరవై వినాయక సూక్ష్మ చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించి గణనాథుడిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు.