ప్రాణాలకు తెగించి నేరస్థుడిని అరెస్టు చేసిన కానిస్టేబుల్!

ప్రాణాలకు తెగించి నేరస్థుడిని అరెస్టు చేసిన కానిస్టేబుల్! యాక్షన్ సినిమా సన్నివేశాన్ని మించిన సీన్‌ ఇది..! ఒక 50 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ తన ప్రాణాలను పణంగా పెట్టి కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్నాడు. బైక్‌పై పారిపోతున్న చైన్‌స్నాచర్‌ని కానిస్టేబుల్‌ వెంబడించాడు. అతి కష్టం మీద ఎట్టకేలకు వాడిని అరెస్ట్‌ చేయగలిగాడు.. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. దాంతో కానిస్టేబుల్‌ ధైర్య సహాసాలపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.