సృష్టిలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులకు జంతువులను పోలిన శిశువులు జన్మించడం, జంతువులకు మనుషులను పోలిన పిల్లలు పుట్టడం చూస్తుంటాం. ఇదంతా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అలా జరుగుతుందని అనుకుంటాం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కొబ్బరిచెట్టుకు ఒకటే తల ఉంటుంది. కొమ్మలు ఉండవు ఈ విషయం అందరికీ తెలిసిందే..! అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొబ్బరిచెట్టుకు రెండు తలలు ఉన్నాయి. రెండూ చక్కగా పచ్చని ఆకులతో కాయలతో కళకళలాడుతోంది. ఈ చెట్టును ఆశ్చర్యంగా చూస్తున్నారు జనం.