మేడారం వెళ్లే ప్రతి భక్తులు మొదట ములుగు శివారులోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. తొలి మొక్కు గట్టమ్మకు సమర్పిస్తారు. ఆ ఘట్టమ్మ దేవాలయమే ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకునేలా చేసింది. ఘట్టమ్మ సాక్షిగా రక్తం చిందేలా చేసింది. గట్టమ్మ దేవత మాదంటే మాదే అంటూ ముదిరాజ్ వర్గం - నాయకపోడు సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు తన్నుకున్నారు. దేవాలయం సన్నిధిలోనే సిగపట్లు పట్టుకున్నారు. చివరకు రక్తం చిందించారు. ఒకప్పుడు ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు. మేడారం సమ్మక్క సారక్క జాతర వల్ల గట్టమ్మ దేవాలయానికి ప్రాధాన్యత సంతరిచుకుంది. ఈ మధ్యకాలంలో గట్టమ్మ దేవాలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.