అరుదైన సముద్ర జీవులకు పొంచి ఉన్న ముప్పు సముద్రం ఎన్నో జలచరాలకు ఆవాసం. చిన్న చేపలు నుంచి పెద్ద పెద్ద తిమింగలం వరకు అంతులేని సంఖ్యతో సముద్రాన్ని తమ ఆవాసం చేసుకుని జీవిస్తూ ఉంటాయి. రోజు రోజుకూ ఈ సముద్రాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నదీ ప్రవాహాలు తో పాటు కొట్టుకొచ్చే ప్లాస్టిక్ వ్యర్ధాలు, రసాయనాలు సముద్ర జీవులకు శాపంగా పరిణమిస్తున్నాయి